భారత్‌లో పరిస్థితి చూస్తే.. గుండె తరుక్కుపోతుంది: WHO

by Shamantha N |
భారత్‌లో పరిస్థితి చూస్తే.. గుండె తరుక్కుపోతుంది: WHO
X

జెనీవా: కరోనాతో అల్లాడుతున్న భారత్‌ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అదనోమ్ అన్నారు. భారత్‌కు ఏ సాయం కావాలన్నా అందించడానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉందని ఆయన భరోసానిచ్చారు. దేశంలో కరోనా రోజూవారీ కేసులు 3.5 లక్షలు దాటడం, మరణాలు 3 వేలకు చేరువలో నమోదవుతున్న వేళ టెడ్రోస్ స్పందించారు.

‘భారత్‌లో పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో తరఫున కావాల్సిన సాయం అందిస్తాం..’ అని ఆయన సోమవారం తెలిపారు. యూఎన్ హెల్త్ ఏజెన్సీ తరఫున ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, మొబైల్ మెడికల్ కిట్లు, లేబోరేటరీ ఉత్పత్తులను పంపిస్తున్నామని ట్రెడోస్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed