- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో 39 శాతం పెరిగిన మొబైల్ వాడకం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు కరోనా వల్ల ఇంటికే పరిమితమైన గతేడాది హై-స్పీడ్ డేటాను వినియోగించారని యాప్ యానీ అనే పరిశొధనా సంస్థ తెలిపింది. ‘స్టేట్ ఆఫ్ మొబైల్-2021 రిపోర్ట్’ పేరుతో చేసిన పరిశీలనలో 2020 ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 వేల కోట్ల కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇది 2019తో పోలిస్తే 7 శాతం అధికం. భారత్ అత్యధికంగా 2,500 కోట్ల యాప్‌లను డౌన్‌లోడ్ చేసి చైనా తర్వాతి స్థానంలో నిలిచింది. దీని ప్రకారం..ప్రజలు ఇదివాకు ఎప్పుడూ లేనంతగా మొబైల్ వినియోగానికి సమయం కేటాయించాలని యాప్ యానీ నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లో మొబైల్ వినియోగానికి గడిపిన సమయం 2019లో రోజుకు 3.3 గంటల నుంచి 2020లో 4.6 గంటలకు అంటే 39.4 శాతం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
ఈ అంశంలో ఇండోనేషియా ప్రజలు అత్యధికంగా 5.2 గంటలు మొబైల్‌ను వాడుతుండగా, బ్రెజిల్ ప్రజలు తర్వాత 4.8 గంటలు కేటాయిస్తున్నారు. గతేడాది భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ప్రజలు జూమ్, వెబెక్స్, గూగుల్ మీట్ వంటి బిజినెస్ యాప్‌లను ఎక్కువగా ఉపయోగించారు. 2020 మూడో త్రైమాసికంలో బిజినెస్ యాప్‌ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కేటాయించిన సమయం 300 గంటలకు చేరుకుందని నివేదిక తెలిపింది. భారత్‌లో ఫైనాన్స్ యాప్‌ల డౌన్‌లోడ్‌లు 25 శాతం పెరగ్గా, ఈ యాప్‌లలో కేటాయించిన సమయం 75 శాతం పెరిగింది. ఇది ఆసియా ప్రాంతంలోనే అత్యధికమని నివేదిక వెల్లడించింది.