ట్రెండింగ్‌లోనే చైనా యాప్స్

by Sujitha Rachapalli |
ట్రెండింగ్‌లోనే చైనా యాప్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో.. భారతీయలు చైనా యాప్స్‌ను డిలీట్ చేయాలని, వాటిని వాడకూడదని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి భారీగానే మద్దతు లభిస్తున్నా కానీ, చైనా యాప్స్ డౌన్‌లోడ్ల సంఖ్య అసలు ఏ మాత్రం తగ్గకపోగా టాప్ డౌన్‌లోడ్ యాప్స్ జాబితాలోనే నిలవడం గమనార్హం. యాప్ ఎనలిటికల్ ప్లాట్‌ఫామ్ సెన్సార్ టవర్.. మే 25 నుంచి జూన్ 14 వరకు ఉన్న డేటా ప్రకారం.. టాప్ 15 డౌన్‌లోడింగ్ యాప్స్‌లో చైనాకు చెందినవి నాలుగు ఉండగా, భారత్‌కు చెందినవి రెండు యాప్స్ మాత్రమే ఉన్నాయి. కాగా టాప్ ప్లేస్‌లో జూమ్ యాప్ నిలిచింది.

1. జూమ్ – 17,200,000 డౌన్‌లోడ్స్
2. ఆరోగ్య సేతు – 14,400,000
3. టిక్‌టాక్ – 13,800,000
4. లూడో కింగ్ – 9,900,000
5. గూగుల్ మీట్ – 9,600,000

హెలో, యూవీడియో, పబ్‌జీ మొబైల్ గేమ్‌లు ఏడు, పదకొండు, పన్నెండో స్థానాల్లో నిలిచాయి.

Advertisement

Next Story

Most Viewed