- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రా గా ముగిసిన వార్మప్ మ్యాచ్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరుగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ముందు భారత జట్టుకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్‌లో పింక్ బాల్ (డే/నైట్) టెస్టుకు ముందు భారత జట్టుకు మూడు రోజుల డే/నైట్ వార్మప్ మ్యాచ్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడింది. సిడ్నీలోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా ‘ఏ’, ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి రోజు రెండు జట్లు ఆలౌట్ అవగా.. ఇండియన్స్‌కు 86 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో రోజు ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. హనుమ విహారి, పంత్ సెంచరీలు బాదడంతో రోండో రోజు ఆటముగిసే సమయానికి ఇండియన్స్ 386/4 స్కోర్ చేసింది. మూడో రోజు ఆటను డిక్లెర్ చేస్తున్నట్లు ఇండియన్స్ కెప్టెన్ అజింక్య రహానే ప్రకటించాడు. దీంతో 473 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 307/4 స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
శతక్కొట్టిన మెక్‌డెర్మెట్, వైల్డర్‌మత్
473 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ‘ఏ’ను ఇండియన్స్ బౌలర్ మహ్మద్ షమీ పెద్ద దెబ్బ తీశాడు. ఓపెనర్లు మార్కస్ హారిస్ (5), జో బర్న్స్ (1) మరోసారి విఫలమయ్యారు. షమీ బౌలింగ్‌లో పృథ్వీషాకు క్యాచ్ ఇచ్చి హారిస్ పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా అవుటై బర్న్స్ వెనుదిరిగాడు. ఇక నిక్ మాడిసన్ (14) సిరాజ్ బౌలింగ్‌లో సైనీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ‘ఏ’ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చి అలెక్స్ క్యారీ (58)తో కలసి బెన్ మెక్‌డార్మెట్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నిలకడగా ఆడుతూ ఇండియన్స్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. కీలకమైన ఈ భాగస్వామ్యాన్ని హనుమ విహారి విడగొట్టాడు. అలెక్స్ కేరీ.. హనుమ విహారి బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ కార్తీక్ త్యాగికి క్యాచ్ అచ్చి పెవీలియన్ చేరాడు. ఇక మెక్‌డార్మెట్ (107)కు తోడుగా వచ్చిన జాక్ వైల్డర్‌మత్ (111) దాటిగా ఆడాడు. మెక్‌డార్మెట్ నెమ్మదిగా ఆడినా.. వైల్డర్‌మత్ మాత్రం బౌండరీలు, సిక్సులతో చెలరేగాడు. వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేసుకొని అదే దూకుడుతో ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ అజేయంగా 165 పరుగులు జోడించారు. అయితే సమయం ముగిసిపోయినా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. షమీ 2 వికెట్లు తీయగా, విహారి, సిరాజ్ చెరో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు సంక్షిప్తంగా
ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ 194 ఆలౌట్
ఆస్ట్రేలియా ఏ తొలి ఇన్నింగ్స్ 108 ఆలౌట్
ఇండియన్స్ రెండో ఇన్నింగ్స్ 386/4 డిక్లేర్ట్
ఆస్ట్రేలియా ‘ఏ’ రెండో ఇన్నింగ్స్
మార్కస్ హారిస్ (సి) పృథ్వీషా (బి) మహ్మద్ షమీ 5, జో బర్న్స్ (ఎల్బీడబ్ల్యూ) మహ్మద్ షమీ 1, నిక్ మాడిసన్ (సి) సైనీ (బి) మహ్మద్ సిరాజ్ 14, బెన్ మెక్‌డార్మెట్ 107 నాటౌట్, అలెక్స్ కేరీ (సి-సబ్) కార్తీక్ త్యాగీ (బి) విహారి, జాక్ వైల్డర్‌మత్ 111 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (75 ఓవర్లు) 307/4
వికెట్ల పతనం : 1-6, 2-11, 3-25, 4-142
బౌలింగ్ : మహ్మద్ షమీ (13-3-58-2), జస్ప్రిత్ బుమ్రా (13-7-35-0), మహ్మద్ సిరాజ్ (17-3-54-1), నవదీప్ సైనీ (16-0-87-0), హనుమ విహారి (7-1-14-1), మయాంక్ అగర్వాల్ (6-0-30-0), పృథ్వీషా (3-0-26-0)