- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం నుంచి మూలధన మద్దతు కోరిన ఐవోబీ
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు గానూ ప్రభుత్వం నుంచి సుమారు రూ. 1,000 కోట్ల మూలధన మద్దతును కోరినట్టు ఐవోబీ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పి పి సెన్‌గుప్తా తెలిపారు. గత మూడు త్రైమాసికాలుగా బ్యాంకు లాభాలను నమోదు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన త్రైమాసికాల్లో రికవరీలు, వ్యాపార వృద్ధిపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది.
‘వరుస త్రైమాసికాల్లో బ్యాంకు సాధిస్తున్న లాభాలను ఇలాగే కొనసాగించే చర్యలను చేపడతామని సెన్‌గుప్తా చెప్పారు. బ్యాంకు నమోదు చేస్తున్న లాభాలకు మద్దతుగా మూలధనాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. ఆ లక్ష్యం దిశగా పయనిస్తున్నాం. దానికి తగిన ప్రణాళికను కలిగి ఉన్నాం. అందుకోసమే ప్రభుత్వం నుంచి మూలధన మద్దతును కోరుతున్నట్టు ఆయన వివరించారు. అత్యవసర, ఆకస్మిక పరిస్థితుల్లో మూలధనాన్ని భరోసాగా ఉంచుకోవాలని కోరుతున్నామని సెన్‌గుప్తా వెల్లడించారు.
తాము రూ. వెయ్యు కోట్ల వరకు మాత్రమే మూలధన మద్దతు కావాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మొత్తం ఆర్థిక సంవత్సరంలో సేకరించిన లాభాలతో బ్యాంకు మూలధన నిష్పత్తి 11 శాతం కంటే అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, మార్కెట్ల నుంచి రూ. 5 వేల కోట్లను సేకరించడానికి అనుమతి ఉందని, అయితే అది తక్షణ ప్రణాళిక కాదని సెన్‌గుప్తా తెలిపారు. ప్రస్తుతానికి మార్కెట్ల నుంచి నిధుల సేకరణకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక లేదన్నారు.