- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రోలర్స్‌కు సాష్టాంగ ప్రణామాలు : సింగర్
దిశ, సినిమా : రియాలిటీ షోస్‌కు కాంట్రవర్సీలు కొత్తేం కాదు. వివాదాలతోనే సదరు షోస్‌కు హైప్ క్రియేట్ చేస్తుంటారు. తాజాగా ‘ఇండియన్ ఐడల్ సీజన్ 12’ను కూడా కాంట్రవర్సీస్ చుట్టుముట్టాయి. బాలీవుడ్ సింగర్ కిషోర్ కుమార్ స్పెషల్ ఎపిసోడ్స్‌లో కంటెస్టెంట్ల పూర్ సింగింగ్‌పై ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా.. రీసెంట్ ఎపిసోడ్ తర్వాత తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియను ఎలిమినేట్ చేయాలనే డిమాండ్స్ కూడా ఎక్కువయ్యాయి. కాగా ఈ విమర్శలను తిప్పికొట్టిన సింగర్ కమ్ ఇండియన్ ఐడల్ హోస్ట్ ఆదిత్య నారాయణ్.. ఈ సీజన్‌లో పాల్గొంటున్న 12 మంది అత్యుత్తమ కంటెస్టెంట్స్ అని చెప్పారు. ట్రోల్స్ రావడం కూడా ఒకవిధంగా మంచిదేనని, రియాలిటీ షో బయట వాస్తవ పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయనే విషయాన్ని వారు తెలుసుకుంటారని అభిప్రాయపడ్డారు.
తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలపై స్పందించిన ఆదిత్య.. ‘ట్రోలర్స్ అందరికీ సాష్టాంగ ప్రణామాలు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చిరుతపులి వేగంగా పరుగెత్తగలనని నిరూపించుకునేందుకు ఎప్పుడు కూడా కుక్కల పరుగు పందెంలో పాల్గొనదనే విషయం గుర్తుంచుకోండి. కొన్నిసార్లు మీ పాయింట్‌ను నమ్మించేందుకు చేసే ప్రయత్నం.. మీ సొంత ఇంటెలిజిన్స్, అనుభవానికే అమమానం. ఈ షోకు ఎంపికైన ఉత్తమ పార్టిసిపెంట్లను సమర్థించేటపుడు నేను ఈ విధంగానే భావిస్తా. 24 వారాలుగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఇండియన్ ఐడల్ రియాలిటీ షోను నేను డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉందా?’ అని సమాధానమిచ్చారు. కాగా కిషోర్ కుమార్ ట్రిబ్యూట్ ఎపిసోడ్‌కు హాజరైన ఆయన కుమారుడు అమిత్ కుమార్.. తనను పార్టిసిపెంట్ల టాలెంట్‌ను మెచ్చుకోవాల్సిందిగా నిర్వాహకులు ఫోర్స్ చేశారని చెప్పడం షోపై విమర్శలకు దారితీసింది.