భారత హాకీ ప్లేయర్‌ రజనీ కి సీఎం జగన్ వరాల జల్లు

by srinivas |
hockey player rajani
X

దిశ, ఏపీ బ్యూరో: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీ బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కుటుంబ సభ్యులతో పాటు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రజనీకి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 25లక్షల నగదుతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతకం వరకూ భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలకంగా వ్యవహరించారని సీఎం జగన్ కొనియాడారు. ఈ సందర్భంగా రజనీని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు.

గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి..పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌ ప్రకటించారు. రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్‌ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌తో పాటు టోక్యో ఒలంపిక్స్‌ 2020లో కూడా ఆమె పాల్గొన్నారు. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఈ కార్యక్రమంలో రజనీ కుటుంబ సభ్యులు, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ అధికారులు రామకృష్ణ, జూన్‌ గ్యాలట్, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed