- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యాస్ సిలిండర్ల నిల్వలున్నాయి.. భయం వద్దు
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల స్టాక్ సరిపడా నిల్వ ఉన్నందున, ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో ఏ విధమైన ఆందోళన చెందాల్సిన పనిలేదని, అనవసర భయంతో, అవసరం లేకున్నా కొనుగోలు చేయొద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి ఇప్పిలి రమ తెలిపారు. జిల్లాలో ఎల్‌పీజీ వినియోగదారులు భయంతో బుకింగ్ చేయొద్దని, రీఫిల్స్ లీకై స్థానిక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల షోరూం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా వినియోగదారులు కరెన్సీ నోట్లను ఇవ్వడానికి బదులుగా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత నివ్వాలని ఆమె సూచించారు. జిల్లాలోని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు వచ్చే మూడునెలలు
మూడు సిలిండర్లను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున, ఒక్కొక్క వినియోగదారుడికి నెలకు ఒక్క సిలిండర్ను మాత్రమే ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఒక సిలిండర్ పొందిన అనంతరం 15 రోజుల తర్వాతనే మరో సిలిండర్‌కు బుక్ చేసుకోవాలని తెలియజేశారు. ఇండియన్ ఆయిల్ ఎల్‌పీజీ షోరూం షాప్, గోదాం కీపర్, ఎల్‌పీజీ మెకానిక్‌లు, డెలివరీ బాయ్స్, ట్రాక్ డ్రైవర్లందరూ ప్రస్తుత కరోనా వైరస్ వైరస్ నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధుల్లో పాల్గొంటున్నారని రమ ప్రశంసించారు. వీరందరిలో ఎవరైనా దురదృష్టవశాత్తు కరోనా వళ్ళ మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా కింద అందచేయనున్నట్టు ఇండియన్ గ్యాస్ రంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Tags : Indian Gas, Reserves, Consumers, not worry, rangareddy