బంగారానికి మళ్లీ రెక్కలొచ్చాయ్!

by Harish |   ( Updated:2020-07-22 06:40:18.0  )
బంగారానికి మళ్లీ రెక్కలొచ్చాయ్!
X

దిశ, వెబ్‌డెస్క్ :
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం బంగారం, వెండి ధరలు ఆల్ టైం రికార్డును నమోదు చేశాయి. మొదటిసారిగా బంగారం ధరలు రూ. 51 వేల మార్కును చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 1 శాతం మేర పెరగడంతో తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. కరోనా సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలకు ఇంకా ఉద్దీపనలు అవసరమన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఎక్కువగా బంగారంపైనే దృష్టి సారించారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎంసీఎక్‌లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం రూ. 800 పైగా పెరిగి రూ. 51,370కు ఎగిసింది. బంగారం బాటలోనే వెండి కూడా అత్యధికంగా 3,502 పెరిగి రూ. 60,844కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడమే కాకుండా, డాలర్ విలువతో రూపాయి మరింత బలహీనపడటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అలాగే, కరోనా ప్రభావంతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించేందుకు అమెరికా, యూరప్ దేశాలు మరిన్ని ఉద్దీపనలను ప్రకటిస్తాయన్న అంచనాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనిశ్చిత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి తగినట్టుగా రిటర్న్ వచ్చే బంగారంపైనే మదుపర్లు దృష్టి సారించారని అందుకే పసిడి, వెండి లాంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను గమనిస్తే..

24 క్యారెట్లు(10 గ్రాములు)

Advertisement

Next Story