వచ్చే ఏడాది చివర్లో కరోనా పూర్వస్థాయికి ఆర్థికవ్యవస్థ!

by Harish |
వచ్చే ఏడాది చివర్లో కరోనా పూర్వస్థాయికి ఆర్థికవ్యవస్థ!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22లో భారత ఆర్థికవ్యవస్థ 10 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమారు చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్‌డౌన్, సంబంధిత సవాళ్ల నేపథ్యంలో 2021 చివరి నాటికి కరోనాకు ముందుస్థాయికి చేరుకుంటుందని, ముఖ్యంగా 2020-21, చివరి త్రైమాసికం నుంచి సానుకూల వృద్ధి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ మన ఆర్థికవ్యవస్థ వచ్చే ఏడాది చివరి నాటికి కరోనా పూర్వస్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి సానుకూలంగా మారుతుందని’ రాజీవ్ కుమారు తెలిపారు. కరోనా మహమ్మారి ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఉద్యోగాలు పోయాయి, వ్యాపారాలు ఆగిపోయాయి. అయితే, ప్రభుత్వం లాక్‌డౌన్ సవాళ్లను ఎదుర్కొనే చర్యలు చేపట్టడంతో ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవన సంకేతాలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story