- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్కార్ వేడుకలో అందాల భారతీయులు
అవార్డుల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఆస్కార్ అవార్డులు. ఆ అవార్డులు గెలవడం సంగతి పక్కన పెడితే ఆ వేడుకకు హాజరవడం కూడా ఒక జీవితసాఫల్య సంఘటనే అవుతుంది. ఆస్కార్ రెడ్ కార్పెట్ వేడుకలో హాలీవుడ్ అందాల భామలు తమ వస్త్రాలంకరణతో హొయలు తిరిగిపోతుంటారు. ఫ్యాషన్‌కి కొత్త అందాలు నిర్వచించడంలో ఈ రెడ్ కార్పెట్ వేడుక అతి పెద్ద వేదికగా నిలుస్తుంది. అలాంటి రెడ్ కార్పెట్ మీద అందమైన వస్త్రాల్లో తమ అందాలను చూపించే అదృష్టం దక్కించుకున్న భారతీయ భామలు ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం నలుగురే. వారిలో ప్రియాంక చోప్రాకు మాత్రమే రెండు సార్లు ఆ అదృష్టం దక్కింది.
స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాతో ఆస్కార్ వేదిక మీద భారతీయుల సందడి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఫ్రిదా పింటో 2009లో ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద బ్లూ గౌన్‌లో నడిచింది. తర్వాత 2011లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, మల్లిక షెరావత్‌లు మెరిశారు. అలాగే 2016, 2017 సంవత్సరాల్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఆస్కార్ వేదికపై తన అందచందాలను చూపించారు.
ఇక ఆస్కార్‌కు హాజరైన భారతీయ నటులు కూడా కొద్దిమందే ఉన్నారు. ఇప్పటి వరకు అభిషేక్ బచ్చన్, ఏఆర్ రహమాన్ దంపతులు, అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, అనుపమ్ ఖేర్‌లతో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కూడా ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు.