‘చైనా కుట్రలను భారత ఆర్మీ తిప్పికొట్టింది’

by Shamantha N |
‘చైనా కుట్రలను భారత ఆర్మీ తిప్పికొట్టింది’
X

న్యూఢిల్లీ: శత్రుదేశాల కుట్రలను భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొట్టిందని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె పేర్కొన్నారు. ప్రాణాలనూ లెక్కచేయకుండా దేశం కోసం పోరాడారని తెలిపారు. సరిహద్దులో చైనా దుందుడుకును పరోక్షంగా ఉటంకిస్తూ భారత జవాన్లు అనుక్షణం పోరాటానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. చైనాతో ఉద్రిక్తతలు తొలగించడానికి చర్చలు జరుగుతున్నప్పటికీ ఆకస్మిక ఘటనలను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉన్నారని వివరించారు. దేశ సంరక్షణ కోసం ప్రాణాలర్పించిన జవానుల త్యాగాలు ఎప్పటికీ ప్రేరణగానే నిలుస్తాయని సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన ఆర్మీ డే వేడుకల్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణెలు పాల్గొన్నారు. అమర జవాన్లు స్మారకానికి నివాళులర్పించారు. పరమవీర చక్ర, అశోక చక్ర గ్రహీతలు పరేడ్‌లో పాల్గొన్నారు. వీరి వెనుకే ఇతర బృందాలూ పరేడ్ చేపట్టాయి. అనంతరం భారత సైన్యం డ్రోన్ స్వార్మింగ్ సామర్థ్యాలను ప్రదర్శించింది.

Advertisement

Next Story

Most Viewed