- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జాతీయ జెండాకు అవమానాన్ని ఉపేక్షించం: జవదేకర్
by Shamantha N |

X
న్యూఢిల్లీ: ఎర్రకోటలో జాతీయ జెండాకు అవమానం జరిగిందని, దీన్ని జాతి ఎప్పటికీ ఉపేక్షించబోదని కేంద్రం తెలిపింది. అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరించారు. ట్రాక్టర్ ర్యాలీ అదుపు తప్పి కొందరు ఎర్రకోటపైన నిషాన్ సాహిబ్ జెండా ఎగరేయడాన్ని ఉటంకిస్తూ జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకమవడంపై రాహుల్ గాంధీపై ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ రైతుల ఆందోళనలను కేవలం మద్దతు పలకడానికి పరిమితం కాలేదని, వారిని హింసకు ప్రేరేపించారని అన్నారు. గతంలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనల్లోనూ రాహుల్ గాంధీ ఇదే తీరులో వ్యవహరించారని తెలిపారు.
Next Story