- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూడవ రోజు మనదే.. ఆట ముగిసే సరికి ఏమైందంటే..!
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కాన్పూర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మూడవరోజు కివీస్‌పై భారత్ పై చేయి సాధించింది. రెండవరోజు చివర్లో కివీస్ పూర్తి ఆధిపత్యం సాధించింది. ఇక మూడవ రోజు భారత బౌలర్లు రాణించడంతో కివీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. కివీస్ బ్యాటర్లల్లో టామ్ లాథమ్ (95), విల్ యంగ్ (89) రాణించడంతో కివీస్ 296 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 49 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత బౌలర్లల్లో అక్షర్ పటేల్ 5 వికెట్లతో రెచ్చిపోగా, అశ్విన్ 3 వికెట్లు, ఉమేష్ యాదవ్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. 49 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కి ఆదిలోనే శుభ్ మన్ గిల్ ఔట్ అవ్వడంతో గట్టి ఎదురుదెబ్బే తాకింది. ఈ క్రమంలో 3 వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక్క వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌కి 63 పరుగుల ఆధిక్యం ఉంది.
Advertisement
Next Story