బంగ్లాకు మరో 20 శాతం విద్యుత్ సరఫరాకు.. కేంద్రం అంగీకారం

by Shamantha N |
బంగ్లాకు మరో 20 శాతం విద్యుత్ సరఫరాకు.. కేంద్రం అంగీకారం
X

అగర్తలా: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య విద్యుత్ ఒప్పందాన్ని కేంద్రం పొడిగించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పొడగించడంతో పాటు, 20 శాతం అదనంగా విద్యుత్ పంపిణీ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించింది.

దీంతో త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఈసీఎల్) బంగ్లాకు ఇకపై 192 మెగా‌వాట్ల విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఇంతకు ముందు ఇది 160 మెగావాట్లుగా ఉంది. భారత్, బంగ్లాదేశ్ 2010 జనవరి 11న పరస్పర అంగీకారంతో విద్యుత్ వాణిజ్యం కోసం ఒక ధరను నిర్ణయించుకున్నాయి. అయితే ఈ ఏడాది మార్చి 16తోనే ఈ గడువు ముగిసిందని అధికారులు తెలిపారు.

ఈ మేరకు భారత్ తరఫున టీఎస్ఈసీఎల్ ఎన్టీపీసీ సీఈవో ప్రవీణ్ సక్సేనా బంగ్లాదేశ్ ప్రతినిధితో కలిసి ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో ఈ ఏడాది మార్చి 17 నుంచే తాజా ఒప్పందం అమలు అవుతుందని వెల్లడించారు. వాటాదారుల మధ్య నాలుగు సమావేశాల తర్వాత ఒప్పందం యొక్క సవరించిన నిబంధనలు, షరతులు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed