కెనడాకు ఇండియా వార్నింగ్

by vinod kumar |
కెనడాకు ఇండియా వార్నింగ్
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతు ఆందోళనలపై కెనడా పీఎం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ ఖండించింది. కెనడా పీఎం ట్రూడో, ఆ దేశ చట్టసభ్యులు తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. కెనడా నేతలు అదే వైఖరిని కొనసాగిస్తే తీవ్రపరిణామాలుంటాయని పేర్కొంది. ఆ వ్యాఖ్యలు కెనడాలోని తమ దేశ దౌత్యకార్యాలయాల ఎదుట అతివాద కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్నాయని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కెనడా దౌత్యాధికారులకు తాకీదులు అందించింది. భారత దౌత్యాధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కెనడా సర్కారుకు ఉంటుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed