టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు.. తొలిటెస్టు డ్రా

by Anukaran |
టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు.. తొలిటెస్టు డ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: కాన్పూర్‌ వేదికగా జరిగిన న్యూజీలాండ్‌-టీమిండియా తొలి టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆదిపత్యం కనబరిచి.. మరుసటి రోజు 345 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజీలాండ్‌ 296 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌లో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు తీసి డిక్లేర్డ్ ప్రకటించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్‌ జట్టు చివరి వికెట్‌‌ వరకు పోరాడి డ్రాగా టెస్ట్ మ్యాచ్‌ను ముగించింది. టామ్ లాథమ్ (52), విలియం సోమర్విల్ (36) కేన్ విలియమ్సన్ (24) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేదు. దీంతో 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా.. చివరి వికెట్ తీయడం భారత్‌కు సాధ్య పడలేదు. ఈ క్రమంలో ఐదో రోజు ముగిసే సరికి ఇంకా పరుగులు చేయాల్సి ఉన్నప్పటికీ.. కివీస్ జట్టులో (అజాజ్ పటేల్ 0 నాటౌట్), రచిన్ రవీంద్ర 18 నాటౌట్‌)గా నిలిచి భారత విజయాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో న్యూజీలాండ్ 165 పరుగులు చేయగలిగింది. చివరకు తొలి టెస్టు డ్రా అయింది.

Advertisement

Next Story

Most Viewed