తొలి రోజు ఇంగ్లాండ్ ‘రూట్’లోనే..!

by Anukaran |   ( Updated:2021-02-05 07:32:43.0  )
తొలి రోజు ఇంగ్లాండ్ ‘రూట్’లోనే..!
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్.. సుధీర్ఘ కాలం తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా శుక్రవారం తొలి టెస్టు ఆడుతున్న జో రూట్ సేన అద్భుత ప్రదర్శన చేసింది. చెన్నెలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ధాటిగా ఆడారు. డే ముగిసే సరికి 89.3 ఓవర్లలో 263 పరుగులతో 3 వికెట్లను నష్టపోయారు. బ్యాట్స్‌మెన్లు బంతులను సమర్థంగా ఎదుర్కొంటూ క్రీజులో పుంజుకోవడంతో.. మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు ఆధిపత్యం కనబర్చింది. ముఖ్యంగా కెప్టెన్ జో రూట్(128) అద్భుత సెంచరీతో ఇంగ్లాండ్‌ స్కోరు దూసుకెళ్లింది

ఇన్నింగ్స్ సాగిందిలా..!

ఇంగ్లాండ్ జట్టు నుంచి తొలుత ఓపెనింగ్‌కు రోరీ బర్న్స్‌, సిబ్లే కాసేపు క్రీజులో కుదురుకున్నారు. ఓపెనర్ రోరీ 23 ఓవర్ల వరకు క్రీజుల నిలబడి 60 బంతుల్లో 33 పరుగులు చేశాడు. 24వ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్ వేసిన స్పిన్‌ బంతికి కాస్త కన్ఫ్యూజ్ కావడంతో కీపర్ రిషబ్ పంత్ చేతికి క్యాచ్ వెళ్లింది. దీంతో 23.5వ బంతికి ఇంగ్లాండ్ జట్టు 63 పరుగులతో ఒక వికెట్‌ను కోల్పోయింది. ఇదే ఉత్సాహంతో భారత బౌలర్లు ఇంగ్లాండ్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే వన్‌డౌన్‌లో వచ్చిన డానియెల్ లారెన్స్‌ (0)ను LBWతో డకౌట్ చేశాడు బుమ్రా. ఈ వికెట్‌తో‌ ఇంగ్లాండ్ జట్టు 63 పరుగుల వద్దనే రెండో వికెట్‌ను కూడా కోల్పోయింది.

కానీ, భారత బౌలర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ.. మరో ఓపెనర్ సిబ్లే క్రీజులో పాతుకుపోయాడు. అతడికి తోడు కెప్టెన్ జో రూట్ చెలరేగిపోయాడు. సిబ్లే మొత్తం 286 బంతులను ఎదుర్కొని 87 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ 197 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌తో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్‌ స్కోరు 263కు చేరింది. కానీ, చివరి ఓవర్ వేసి బుమ్రా ఎట్టకేలకు సిబ్లే వికెట్ తీసుకున్నాడు. 89.3వ బంతికి LBWతో సిబ్లే‌ను ఔట్ చేసి పెవిలియన్ పంపాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయింది.

Scoreboard

England 1st Innings 263-3 (89.3 Ov)

1. రోరీ బర్న్స్ c పంత్‌ b అశ్విన్ 33 (60)

2. డొమినిక్ సిబ్లే lbw b బుమ్రా 87 (28)

3. డానియెల్ లారెన్స్ lbw b బుమ్రా 0 (5)

4. జో రూట్ (c)bating 128 (197)

అదనపు పరుగులు: 15

మొత్తం స్కోరు: 263/3

వికెట్ల పతనం: 63-1 (రోరీ బర్న్స్, 23.5), 63-2 (డానియెల్ లారెన్స్, 25.4), 263-3 (డొమినిక్ సిబ్లే, 89.3)

బౌలింగ్:

ఇషాంత్ శర్మ 15-3-27-0
జస్ప్రీత్ బుమ్రా 18.3-2-40-2
రవిచంద్రన్ అశ్విన్ 24-2-68-1
షాబాజ్ నాదీమ్ 20-3-69-0
వాషింగ్టన్ సుందర్ 12-0-55-0

Advertisement

Next Story