మరో ఉత్కంఠ పోరు.. అఫ్ఘనిస్తాన్‌పై భారత్ గెలిచేనా..!

by Anukaran |   ( Updated:2021-11-03 11:13:09.0  )
మరో ఉత్కంఠ పోరు.. అఫ్ఘనిస్తాన్‌పై భారత్ గెలిచేనా..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా వరుసగా పాకిస్తాన్-న్యూజీలాండ్‌ జట్లపై ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం షేక్ జాయేద్ స్టేడియం వేదికగా అఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తుందా లేదా అనేది అభిమానుల్లో సందేహం నెలకొంది. టాప్ ఆర్డర్ విఫలం, మిడిలార్డర్‌లోనూ ఇదే పరిస్థితి రెండు మ్యాచుల్లో తేటతెల్లమైంది.

ఇక బౌలర్లు కూడా వారి స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ఆటగాళ్లతో పాటు బీసీసీఐపై అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక అభిమానుల కామెంట్లపై ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా స్పందించలేదు. కానీ, నేడు జరగబోయే మ్యాచ్‌లో అయినా భారీ తేడాతో విజయం సాధించాలనే ఆశతో టీమిండియా ఫ్యాన్స్ ఉన్నారు. అద్భుతాలు జరిగితేనే టీమిండియాకు సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది.

కానీ, అఫ్ఘనిస్తాన్‌ టీమిండియాపై విజయం సాధిస్తే చాలు సెమీస్‌కు వెళ్లడం ఈజీ అవుతోందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు ఆడిన మూడు మ్యాచుల్లో అఫ్గనిస్తాన్ 2 విజయాలు నమోదు చేసుకుని 4 పాయింట్లతో సెమీస్‌ రేసులో ఉంది. ఇక ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మ్యాచ్‌ ముగిసేవరకు వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story