- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీతంపై ఆశలొద్దు!
దేశంలో జీతాలు పెరిగే అవకాశం లేదు. ఆర్థిక మందగమనం ధాటికి దశాబ్దకాలంలోనే అతి తక్కువ జీతం పెంపు ఉండొచ్చని ఓ సర్వే పేర్కొంది. వాణిజ్య కార్యకలాపాలు తగ్గిపోవడంతో 2020 ఏడాదికి సగటు జీతం పెంపు 9.1 శాతానికే పరిమితమవుతుందని సేవల సంస్థ ఎవోన్ సర్వే తెలిపింది. 2018లో వార్షిక వేతన పెంపు 9.5 శాతం ఉండగా, 2019లో 9.3 శానికి తగ్గిందని, ఈ ఏడాది అది మరింత క్షీణించిందని వెల్లడించింది.
మొత్తంగా జీతం పెంపు తక్కువగా నమోదైనప్పటికీ కొన్ని సంస్థలు మాత్రం 8 నుంచి 10 శాతం వరకు ఇంక్రిమెంట్లు ఇవ్వనుండటం విశేషం. ఇక 2020లో వేతన వృద్ధిని 10 శాతానికి పైగా పెంచుతామని సుమారు 40 శాతం సంస్థలు చెప్పినట్లు సర్వేలో ఉంది. గతంలో 2012 నుంచి 2016 మధ్యవేతన వృద్ధి రెండంకెలు సాధించాయని ఈ మధ్య కాలంలోనే 9 శాతానికి క్షీణిందని సర్వే పేర్కొంది. ఈ సర్వే 20 రంగాల నుంచి 1000కిపైగా సంస్థల్లో వివరాలను సేకరించింది. ఆసియా పరిధిని పరిశీలిస్తే జీతం పెరుగుదలలో ఇండియానే ముందుంది. ఇండియా తర్వాత రెండోస్థానంలో చైనా 6.3 శాతం వేతన వృద్ధిని కలిగి ఉంది. ఫిలిప్పీన్స్‌లో 5.8 శాతం ఉంది. అతి తక్కువ వేతనవృద్ధితో జపాన్ 2.4 శాతంతో వెనకబడి ఉంది.
2019లో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇండియాలోని అనేక సంస్థలు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. వేతనాల పెరుగుదల ఇండియాలోనే అధికంగా ఉండటం దీనికి సాక్ష్యంగా భావించవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో వేతన వృద్ధి పెరగడానికి ద్రవ్యోల్బణ రేటు, ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యాపారం కారణమని అయాన్ రివార్డ్ సొల్యూషన్స్‌కు చెందిన ఫెర్నాండెజ్ చెప్పారు. ఆటోమోటివ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమ అత్యంత దారుణమైన క్షీణతను నివేదించాయి. 2018లో 10.1 శాతం ఉన్న వేతన వృద్ధి 2020 నాటికి 8.3 శాతానికి దిగజారింది. రియల్ ఎస్టేట్ రంగం కూడా 8.3 శాతం వేతన వృద్ధిని కలిగి ఉంది. కరోనా వైరస్, వ్యాపారంలో పోటీ కారణంగా రవాణా రంగంలో వేతన వృద్ధి 7.6 శాతంగా ఉంది.