- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో వరుసగా బ్యాడ్మింటన్ టోర్నీలు
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: మూడు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలకు ఇండియా వేదిక కాబోతున్నది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా రద్దయిన ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ జనవరి 11 నుంచి 16 వరకు జరుగనున్నది. ఇక ఈ ఏడాది కొత్తగా నిర్వహిస్తున్న ఒడిషా ఓపెన్ సూపర్ 100 టోర్నీకి కూడా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) చోటు కల్పించింది. ఒడిషా ఓపెన్ జనవరి 25 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఇక సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నమెంట్ జనవరి 18 నుంచి 23 వరకు జరుగనున్నది. వచ్చే ఏడాది జనవరిలోనే మూడు మెగా టోర్నీలకు బీడబ్ల్యూఎఫ్ తమ క్యాలెండర్‌లో చోటు కల్పించింది. ఈ మేరకు బీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి థామస్ ఒక ప్రకటన చేశారు. కాగా గత రెండేళ్లుగా రద్దవుతూ వచ్చిన హైదరాబాద్ ఓపెన్ సూపర్ 100 టోర్నమెంట్‌కు 2022లో కూడా చోటు కల్పించలేదు.
Advertisement
Next Story