చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలి: మోడీ

by  |
చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలి: మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: చైనా వస్తువుల దిగుమతిని పూర్తిగా నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రపంచానికి ఒక దీపశిఖ అని, 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో అనేకం సాధించామని ప్రధాని అన్నారు.

కరోనా వచ్చి ప్రపంచాన్ని పీడిస్తోందని, ఈ కారణంగా ప్రస్తుతం ప్రపంచంతోపాటు దేశం విపత్కర పరిస్థితుల్లో పయనిస్తోందన్నారు. కరోనాతో పాటు దేశవ్యాప్తంగా వరదలు చుట్టుముట్టాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యలు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రధాని అభినందించారు.

భారత్ తయారీ వస్తువులకు పూర్వవైభవం తీసుకురావాలన్నారు. ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటోందని, మన శక్తిని ప్రపంచ అవసరాలకనుగుణంగా మలుచుకోవాలన్నారు. ఎఫ్డీఐల్లో గతేడాది 18 శాతం వృద్ధి సాధించామని ప్రధాని చెప్పారు.


Next Story

Most Viewed