- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా పర్యటన ద్వారా మాకు రూ.89 కోట్ల ఆదాయం : శ్రీలంక
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడనున్నది. జులై 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ద్వారా తమ బోర్డు రూ.89 కోట్లు (12 మిలియన్ డాలర్లు)ఆదాయం ఆర్జించనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ‘ఇటీవల కాలంలో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించడానికి చాలా ప్రయత్నించాము. కానీ వీలుపడలేదు.
కరోనా కారణంగా ఇటీవల పలు సిరీస్‌లు రద్దు కావడంతో శ్రీలంక క్రికెట్‌కు చాలా నష్టం వచ్చింది. అయితే బీసీసీఐ తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి ఆరు మ్యాచ్‌లు ఆడటానికి ఒప్పుకుంది. ఈ పర్యటన ద్వారా తాము రూ. 89 కోట్లు అర్జించనున్నాము. ఇదొక శుభ పరిణామం’ అని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు సిల్వ ప్రకటించారు. సోనీ స్పోర్ట్స్‌తో ఉన్న ఒప్పందం, ఇతర స్పాన్సర్స్ ఒప్పందాల కారణంగానే ఈ ఆదాయ వస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ, ఇండియన్ క్రికెట్ టీమ్ అనేది బంగారు బాతుగుడ్డు అనే విషయం మరోసారి నిరూపించబడినట్లు అయ్యింది.