- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంత మాట అన్నాక నాలుగో టెస్టు ఆడాలా?
దిశ, స్పోర్ట్స్ : బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరగాల్సిన నాలుగో టెస్టుపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉన్నది. భారత క్రికెట్ జట్టుపై క్విన్స్‌లాండ్ ఆరోగ్య మంత్రి రోజ్ బేట్స్ అవమానకరంగా వ్యాఖ్యలు చేయడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. భారత క్రికెటర్లు అసలు నిబంధనలు పాటించరని.. వస్తే రండి లేకపోతే అవసరం లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగో టెస్టు ఆడకుండానే సిడ్నీ టెస్టు అనంతరం ఇండియా తిరిగి వచ్చేస్తే ఎలా ఉంటుందనే దానిపై బీసీసీఐ తమ సభ్యులతో చర్చ జరుపుతున్నది.
పర్యాటక జట్టు కోరిన చిన్న మార్పు కూడా చేయలేకపోతే ఇక అక్కడకు వెళ్లి ప్రయోజనం ఏమిటని బీసీసీఐ భావిస్తోంది. టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా అక్కడి పరిస్థితులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము క్రికెటర్లమా లేదా జూలో జంతువులమా అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు పాటించమని ఎలా ప్రశ్నిస్తారు.. రోహిత్ శర్మ ఇండియా నుంచి వెళ్లి 14 రోజులు క్వారంటైన్‌లో ఉండలేదా అని బీసీసీఐ అధికారి ఒకరు ప్రశ్నించారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే నాలుగో టెస్టు జరుగుతుందని, వేదిక మార్చమని బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపింది.