నిలుస్తుందా?.. చేజార్చుకుంటుందా?

by Shiva |
నిలుస్తుందా?.. చేజార్చుకుంటుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా బిగ్ ఫైట్‌కి రెడీ అయింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంతో ఉండటంతో.. ఈ నాలుగో టీ20 టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైతే సిరీస్ చేజార్చుకోనుంది. దీంతో ఈ మ్యాచ్ టీమిండియాకు చావోరేవో అనేంతగా మారడంతో.. దీని కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచ్ టీమిండియా గెలిస్తే.. సిరీస్‌ను డిసైడ్ చేసే ఐదో టీ20 మరింత రసవత్తరంగా మారే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి రావడంతో.. టీంలో భారీ మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. గత మూడు మ్యాచ్‌లలో రాణించని కేఎల్ రాహుల్ స్థానంలో శిఖర్ ధావన్‌ను తీసుకునే అవకాశముంది.

ఇక శార్ధూల్ ఠాకూర్ స్థానంలో నవదీప్ సైనీని తీసుకునే అవకాశముందని సమాచారం. ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించే అవకాశాలున్నాయి. మరి మ్యాచ్‌ను గెలిచి టీమిండియా సిరీస్‌ బరిలో నిలుస్తుందా?..లేక చేజార్చుకుంటుందా? అనేది చూడాలి

Advertisement

Next Story

Most Viewed