- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టీల్ రంగానికి కరోనా ముప్పు!
దిశ, వెబ్‌డెస్క్ : ఒకవైపు కరోనా వైరస్ అంతర్జాతీయంగా దెబ్బ తీస్తుంటే, మరోవైపు దేశీయంగా నెలకొన్న మందగమనం స్టీల్ రంగాన్ని మరింత దిగజారుస్తోంది. దేశీయంగా మారిన ప్రతికూలత వల్ల దేశంలో స్టీల్ డిమాండ్ పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం స్టీల్ రంగానికి ప్రతికులతలు తప్పవని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో స్టీల్ రంగం 5 శాతం మాత్రమే వృద్ధిని సాధించగలిగింది. ముడి ఇనుము ధరలు పెరగడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ మాంద్యం కూడా డిమాండ్ క్షీణించడానికి కారణమని నివేదిక తెలిపింది.
దేశ వృద్ధి రేటు 2019-20లో 5 శాతం కంటే తక్కువ ఉంది. 2020-21లో దేశ వృద్ధి రేటు 5.5 శాతంగా ఉండే అవకాశముందని అంచనా వేసింది. దేశీయంగానే కాకుండా కరోనా వైరస్ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా స్టీల్‌కున్న డిమాండ్ పడిపోయిందని పేర్కొంది. దీంతో దేశీయంగా కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతోందని అంచనా వేసింది. కరోనా వ్యాప్తి కారణంగా చైనాలో ఇప్పటికే నిర్మాణ రంగం మందగించిందని పేర్కొంది.