- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక మీ బాధ్యతే.. అఫ్ఘాన్ భవిష్యత్‌పై జో బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్ : అఫ్ఘనిస్తాన్ భవిష్యత్ ఇక పొరుగుదేశాల సహకారం మీదే ఆధారపడి ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అఫ్ఘాన్ నుంచి యూఎస్ బలగాల ఉపసంహరణకు సంబంధించిన అధికారిక ప్రకటన సందర్భంగా ఆయన వైట్ హౌస్ నుంచి టెలివిజన్ సందేశమిచ్చారు. బైడెన్ మాట్లాడుతూ.. అఫ్ఘాన్ లో దశాబ్దాలుగా జరుగుతున్న అంతర్గత యుద్ధానికి ఇక ఫుల్ స్టాప్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి అక్కడి నుంచి తమ దేశానికి చెందిన బలగాలను వెనక్కి రప్పిస్తామని తెలిపారు.
అయితే అఫ్ఘనిస్థాన్ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, రష్యా, భారత్, టర్కీల సహకారం ఆ దేశానికి ఉండాలని బైడెన్ ఆకాంక్షించారు. అంతర్గత యుద్ధంలో దెబ్బతిన్న ఆ దేశాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత సరిహద్దు దేశాలపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. అఫ్ఘాన్ లో శాంతి స్థాపనకు ఈ దేశాలు కృషి చేయాలని సూచించారు. ఇదే విషయమై వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ మాట్లాడుతూ.. అఫ్ఘాన్ కు ఇప్పుడు మిలిటరీ యాక్షన్ కంటే దౌత్యపరమైన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తాము (అమెరికా) కూడా మానవతా కోణంలో ఆ దేశానికి సాయం అందిస్తూనే ఉంటామని తెలిపారు.