- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో నాణ్యమైన ఆల్‌రౌండర్ల తయారు కావడం లేదు : వీవీఎస్
దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో నాణ్యమైన క్రికెట్ ఆల్‌రౌండర్లు తయారు కావడం లేదని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. కపిల్ దేవ్ తర్వాత టీమ్ ఇండియాలో అసలైన ఆల్‌రౌండర్ ఇంత వరకు రాలేదని లక్ష్మణ్ పేర్కొన్నాడు. అలా తయారు కాకపోవడానికి టీమ్ ఇండియాపై పని భారం పెరగడమేనని తేల్చి చెప్పాడు.
ఒక పుస్కకావిష్కరణ సందర్భంగా యూట్యూబ్ లైవ్ మాట్లాడుతూ.. ‘ఆల్‌రౌండర్ పని చాలా కష్టమైనది. కపిల్ ఉన్న సమయంలో వికెట్లు తీయడంతో పాటు పరుగులు కూడా చేసే వాడు. ఇండియాకు అతడొక మ్యాచ్ విన్నర్. కానీ అప్పట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఉండేవి కావు కాబట్టి తగినంత విశ్రాంతి దొరికేది. కానీ ఇప్పుడు టీమ్ ఇండియా క్రికెటర్లపై పని భారం పెరిగిపోయింది. అలాంటప్పుడు నాణ్యమైన ఆల్‌రౌండర్లను ఆశించడం తప్పే’ అని లక్ష్మణ్ వెల్లడించాడు. టీమ్ ఇండియాలో కొంత మంది యువ ఆల్‌రౌండర్లు ఉన్నా.. వారు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. మితిమీరిన క్రికెట్ ఆడటం వల్లే ఇలా జరుగుతున్నదని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.