- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 ర్యాంకుల్లో 2వ స్థానానికి టీమ్ ఇండియా
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టీమ్ ఇండియా రెండో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ మధ్య 5 మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ బుధవారం తాజా ర్యాంకుల ప్రకటించింది. న్యూజీలాండ్‌పై ఆస్ట్రేలియా 2-3 తేడాతో ఓడిపోవడంతో ఆసీస్ ఒక ర్యాంకు కోల్పోయి మూడో ర్యాంకుకు చేరుకుంది. దీంతో ఇండియాకు 2వ ర్యాంక్ లభించింది. టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కేవలం 1 పాయింట్ తేడా మాత్రమే ఉన్నది. ఇక 275 ర్యాంకింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతున్నది. పాకిస్తాన్ (4), న్యూజీలాండ్ (5) తమ స్థానాలను నిలుపుకున్నాయి. రేపటి నుంచి ఇంగ్లాండ్-ఇండియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్నది. ఇండియా కనుక ఈ సిరీస్ గెలిస్తే టాప్ ర్యాంకర్ ఇంగ్లాండ్‌కు చేరుగా వచ్చే వీలుంది. న్యూజీలాండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించడం వల్ల ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (830) రెండో స్థానానికి చేరుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ మూడో ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ మలన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ ఆరో ర్యాంకులో ఉన్నాడు.
టీ20 ర్యాంకులు
టీమ్ ర్యాంక్..
1. ఇంగ్లాండ్ (275 రేటింగ్ పాయింట్లు)
2. ఇండియా (268)
3. ఆస్ట్రేలియా (267)
4. పాకిస్తాన్ (260)
5. న్యూజీలాండ్ (253)
బ్యాట్స్‌మెన్
1. డేవిడ్ మలన్ (915)
2. ఆరోన్ ఫించ్ (830)
3. కేఎల్ రాహుల్ (816)
4. బాబర్ ఆజమ్ (801)
5. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (700)
బౌలర్లు
1. రషీద్ ఖాన్ (736)
2. తబ్రిజ్ శంషీ (733)
3. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (730)
4. ఆష్టన్ అగర్ (702)
5. ఆదిల్ రషీద్ (700)
ఆల్‌రౌండర్లు
1. మహ్మద్ నబీ (294)
2. షకీబ్ అల్ హసన్ (268)
3. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (226)
4. రిచర్డ్ బెర్రింగ్టన్ (194)
5. షాన్ విలియమ్స్ (190)