- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల చెదిరింది.. కప్ చేజారింది !
– మహిళా టీ20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా
కోట్లాది భారత క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో చూసిన మహిళా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పేలవ ప్రదర్శనతో చేతులెత్తేసింది. కీలక ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తయ్యి.. ప్రత్యర్థికి సరెండర్ అయిపోయింది. ఒక్క అపజయం లేకుండా ఫైనల్‌లోకి అడుగుపెట్టినా.. ఆ హవాను నిలుపుకోలేక పోయింది. గ్రూప్ దశ నుంచి వెంటాడుతున్న బ్యాటింగ్ లోపాలకు తోడు.. ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తేలిపోయింది. కీలక క్యాచ్‌లను వదిలేయడం.. అనుభవ రాహిత్యం యువ మహిళా జట్టు ఓటమికి కారణాలుగా నిలిచాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 99 పరుగులకే ఆలౌటై కప్‌ను చేజార్చుకున్నారు. 85 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వ విజేతగా అవతరించింది.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఓపెనర్లు హీలీ (75), మూనీ (78) రాణించడంతో నిర్థీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లో దీప్తి 2 వికెట్లు తీయగా, పూనమ్, రాధ చెరో వికెట్ తీశారు. ఇక 185 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. భారత్ బ్యాటింగ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆసీస్ బౌలర్లు మెగన్ షట్, జోనాసేన్ ధాటికి వికెట్లు టపటపా రాలాయి.
బ్యాటింగ్ వైఫల్యమే..
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ ఒక్క భారత బ్యాట్స్‌ఉమెన్ బాధ్యతాయుతంగా ఆడలేదు. ఫుల్ ఫామ్‌లో ఉన్న షఫాలీ(2)ని మొదటి ఓవర్లోనే పెవిలియన్‌కు చేర్చిన ఆసీస్ సగం మ్యాచ్‌ను తమ వైపుకు లాగేసుకుంది. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన తన్మయ్ భాటియా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ డకౌట్ అయ్యింది. స్మృతి మంధాన (11) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ప్రధాన బ్యాట్స్‌ఉమెన్ వెంటెంటనే పెవిలియన్ చేరడం, ఆదుకుంటుందని భావించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ (4) పరుగులే చేసి పెవిలియన్‌కు చేరడంతో అప్పటికే భారత్ ఓటమి ఖరారైంది. చివర్లో దీప్తి శర్మ(33) రాణించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షూట్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్ మూడు వికెట్లు పడగొట్టింది.
అదరగొట్టిన ఆస్ట్రేలియన్లు..
మమూలుగానే చాంపియన్ ఆట తీరుతో అదరగొట్టే ఆసీస్ ఆటగాళ్లు.. ఇక వరల్డ్ కప్ ఫైనల్ వంటి మ్యాచ్‌లో ఎలా ఆడతారో ఊహించిందే. అదే సమయంలో గ్రూప్ దశలో ఆస్ట్రేలియాను ఓడించామనే ఆత్మవిశ్వాసమో ఏమో భారత్ ఆస్ట్రేలియాను లైట్ తీసుకున్నట్టుంది. కానీ ఆస్ట్రేలియా మాత్రం తన వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. బ్యాటింగ్‌లో ఆరంభం నుంచే దూకుడును కొనసాగించింది. భారత ఆటగాళ్లు క్యాచ్‌లను వదిలిపెట్టడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఓపెనర్ అలిస్సా హీలి కేవలం 39 బంతుల్లో 75 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయంటే ఏ రేంజ్‌లో బాదిందో అర్థం చేసుకోవచ్చు. మరో ఎండ్‌లో మూనీ కూడా భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడింది. ఇక బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో భారత బ్యాట్స్‌ఉమెన్‌ను బోల్లా కొట్టించడంలో సక్సెస్ అయ్యారు.
అలీసా హీలికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బెత్ మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ లభించింది.
స్కోర్ బోర్డు :
ఆస్ట్రేలియా బ్యాటింగ్: హీలీ (75), మూనీ (78 నాటౌట్), లానింగ్ (16), గార్డెనర్ (2), హేయిన్స్ (4), కేరీ (5)
ఇండియా బౌలింగ్: దీప్తి శర్మ 2, పూనమ్ 1, రాధ 1.
ఇండియా బ్యాటింగ్: షెఫాలీ వర్మ (2), స్మృతి మంధన (11), తన్మయి భాటియా (2, రిటైర్డ్ హర్ట్), జెమీమా రోడ్రిగ్స్ (0), హర్మన్ ప్రీత్ (4), దీప్తి శర్మ (33), వేద కృష్ణమూర్తి (19), రిచా ఘోష్ (18), శిఖా పాండే (2), రాధా యాదవ్ (1), పూనమ్ యాదవ్ (1), గైక్వాడ్ (1)
ఆస్ట్రేలియా బౌలింగ్: మెగన్ షట్ 4, జోనాసేన్ 3, మొలినెక్స్ 1, కిమ్మిన్స్ 1, కేరీ 1.
tags: ICC, Women WT20, Ind Vs Aus, MCG, Australia Won,