- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెయిర్న్ ఎనర్జీ ఆర్బిట్రేషన్ కేసులో భారత్‌కు ఎదురుదెబ్బ!
దిశ, వెబ్‌డెస్క్ : వొడాఫోన్ మధ్యవర్తిత్వ కేసులో ప్రతికూల తీర్పును ఎదుర్కొన్న భారత్‌కు మూడు నెలల వ్యవధిలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌కు చెందిన చమురు సంస్థ కెయిర్న్ ఎనర్జీకి సంబంధించిన రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదం కేసులో ప్రతికూల తీర్పును ఎదుర్కొంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం(ఆర్బిట్రేషన్) కెయిర్న్ ఎనర్జీ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత్ అడిగినట్టు పన్నులను చెల్లించాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసు విషయంపై భారత్ ఆపేసిన పన్ను రిటర్న్ రీఫండ్, డివిడెండ్లతో పాటు పన్ను వసూళ్ల కోసం విక్రయించిన షేర్ల సొమ్ముకు వడ్డీతో సహా రూ. 8,000 కోట్లు చెల్లించాలని కోరింది. సరిగ్గా మూడు నెలల క్రితం వొడాఫోన్ సంస్థకు చెందిన రెట్రోస్పెక్టివ్ కేసులోనూ భారత ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీన్ని సవాలు చేస్తామని కేంద్రం చెప్పింది. భారత్‌లో నిర్వహిస్తున్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని పేర్కొంది. కానీ, ఆర్బిట్రేషన్ తీర్పును సవాలు చేసేందుకు ఉన్న 90 రోజుల గడువు ఈ నెల 24తో ముగియనుంది.
ద్వైపాక్షిక ఒప్పంద ఉల్లంఘనగా తీర్పు..
కెయిర్న్ సంస్థ 2006లో చేసిన అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర పన్నుల విభాగం 2014లో నోటీసులను ఇచ్చింది. దీంతో పాటు కెయిర్న్ ఎనర్జీ పూర్వ అనుబంధ సంస్థ కెయిర్న్ ఇండియాలోని 10 శాతం వాటాను పన్నుల శాఖ అటాచ్ చేసింది. అనంతరం 2015లో మూలధన రాబడిపై రూ. 10,247 కోట్ల పన్నులను చెల్లించాలని కోరింది. అయితే, 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే కెయిర్ ఎనర్జీకి చెందిన భారత అనుబంధ సంస్థ కెయిర్న్ ఇండియాను వేదాంత సంస్థకు విక్రయించింది. 2017, ఏప్రిల్‌లో కెయిర్న్ ఇండియా, వేదాంత విలీనం తర్వాత వేదాంతలో ప్రిఫరెన్షియల్ షేర్లతో పాటు 5 శాతం వాటాలను అందించారు. దీనివల్ల వేదాంతలో ఉన్న కెయిర్న్ ఎనర్జీ 5 శాతం షేర్లనూ పన్నుల శాఖ అటాచ్ చేసినట్టు అయింది. అంతేకాకుండా, రూ. 1,590 కోట్ల పన్ను రీఫండ్, రూ. 1,140 కోట్ల డివిడెండ్లను ఆపేసింది. దీంతో భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద ఆ నొటీసులను సవాలు చేస్తూ కెయిర్న్ ఎనర్జీ ఆర్బిట్రేషన్ ముందుకు వెళ్లింది. ఈ అంశంలో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తీర్పు ఇస్తూ..ఆపేసిన ట్యాక్స్ రీఫండ్, డివిడెండ్, షేర్ల విక్రయంతో జరిగిన నష్టం మొత్తం కలిపి రూ. 8,000 కోట్లను కెయిర్న్ ఎనర్జీకి భారత్ చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.