భారత్ లో 500 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లు

by Sujitha Rachapalli |
భారత్ లో 500 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లు
X

దిశ, వెబ్ డెస్క్ :
లాక్డౌన్ వేళలో ఇంటర్నెట్ యూజ్ చేసే వారి సంఖ్య రెట్టింపు అయ్యిందన్న సంగతి మనందరికీ తెలుసు. అంతకుముందు జియో రాకతో.. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతానికి భారతదేశంలో 504 మిలియన్ల యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ (IAMAI) అధ్యయనం వెల్లడించింది. మొత్తం 70 శాతం మంది రోజువారీ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నారని తెలిపింది.

ఒకప్పుడు ఇంటింటికీ టీవీ ఎలానో… ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లతో పాటు ఇంటర్నెట్ అలా అయిపోయింది. నెట్ లేని ప్రపంచాన్ని ప్రజలు ఊహించలేకపోతున్నారు. అందుకే నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా క్రైసిస్ లో కూడా చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నారంటే కారణం ఇంటర్నెట్. మనిషి జీవితంలో ఇంటర్నెట్ భాగమైపోయింది. ఐఏఎమ్ఏఐ తాజా గణాంకాల ప్రకారం భారత్ లో 504 మిలియన్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇంటర్నెట్ యూజర్లలో 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లే 433 మిలియన్లు ఉన్నారు. 5-11 సంవత్సరాల వయస్సు వారిలో 71 మిలియన్ల మంది ఉన్నారు. వీరు కుటుంబ సభ్యుల డివైజ్‌ల్లో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారని ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ అధ్యయనం తెలిపింది.

డైలీ యూజర్స్ :

మన దేశంలో ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు 70 శాతం మంది డైలీ యూజర్స్ ఉన్నారు. పట్టణ, నగరాల్లోని నెట్ యూజర్లలో.. 10 మందిలో తొమ్మిది మంది వారానికి ఒకసారి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. 2019 నవంబర్‌లో 26 మిలియన్ల మంది మహిళా ఇంటర్నెట్ యూజర్లు కొత్తగా చేరారు . గ్రామాల్లో నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. , 2019 మార్చిలో పోలిస్తే.. రోజుకు 30 మిలియన్ల మంది కొత్త యూజర్లు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే.. సెలవు రోజులు, ఆది వారాల్లో నెట్ లో ఒక గంట ఎక్కువగానే గడుపుతున్నారు.

Tags: internet users, net, spending time at online

Advertisement

Next Story

Most Viewed