ఇండియాలో మొదలైన ఫస్ట్ సెక్స్ టాయ్స్ స్టోర్

by Anukaran |
Sex Store in Goa
X

దిశ, ఫీచర్స్ : సెక్స్.. అనే పదాన్ని బయటకు పలికేందుకు ఇప్పటికీ కొందరు మొహమాటపడుతుంటారు. కానీ పోర్న్ సైట్లలో మాత్రం గంటలు గంటలు గడిపేస్తుంటారు. ఈ మేరకు గతేడాది కరోనా ఫస్ట్ ఫేజ్ లాక్‌డౌన్‌లో పోర్న్ సైట్లకు 95% ట్రాఫిక్ పెరిగినట్లు పలు సర్వేలు పేర్కొనగా, పోస్ట్ లాక్‌డౌన్‌లో సెక్స్ టాయ్స్ అమ్మకాలు 65% పెరిగినట్లు వెల్లడించాయి. ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ తరహా టాయ్స్ స్టోర్స్‌ డిజిటల్‌ మార్కెట్‌లోనే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం సెక్స్ టాయ్స్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గోవాలో తొలి ఫిజికల్ లీగల్ సెక్స్ టాయ్స్ స్టోర్ ఓపెన్ అయింది.

గోవాలోని కలంగూట్ టౌన్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ స్టోర్‌ లీగల్‌ పర్మిషన్‌తో నిర్వహించబడుతోంది. ఇక్కడ విభిన్నమైన సెక్స్ టాయ్స్, యూనిక్ కండోమ్స్, స్ప్రే, జెల్స్, వైబ్రేటర్స్, పంప్స్ లభించనుండగా, మెడికల్ స్టోర్ మాదిరిగానే ఉన్న ఈ షాప్‌కు కస్టమర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. భారతీయ చట్టాల ప్రకారం అశ్లీలంగా లేని టాయ్స్ అమ్ముకోవచ్చని, అందుకే తాము లీగల్‌గా టాయ్స్ షాప్ ఓపెన్ చేశామని షాప్ ఫౌండర్ నీరవ్ మెహతా తెలిపారు. మహిళలను కించపరిచే రీతిలో టాయ్స్ ప్రదర్శించబోమని వివరించారు. సెక్సువల్ వెల్‌నెస్ కోసం స్టార్ట్ చేసిన తన కామగిజ్మోస్(kamagizmos)టాయ్స్ స్టోర్ కస్టమర్స్‌కు యూనిక్ ప్రొడక్ట్స్ అందిస్తుందని, త్వరలోనే స్టోర్‌ను విస్తరిస్తానని నీరవ్ చెప్పారు.

Advertisement

Next Story