- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రిహానా’ దేశానికి భారత్ వ్యాక్సిన్ సాయం..
దిశ, వెబ్‌డెస్క్ : సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 2 నెలలుగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకల్లో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత కేంద్రం నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది.వారి శిబిరాల్లో ఇంటర్నెట్‌తో పాటు కరెంట్ సరఫరా నిలిపివేసింది.ఈ కథనాలు అంతర్జాతీయ వార్తా పత్రికల్లో ప్రచురితం అవ్వగా కరేబియన్ దీవుల్లోని బార్బాడోస్ ఐలాండ్ కంట్రీకి చెందిన పాప్ సింగర్ రిహానా స్పందించింది. ‘దీనిపై మనం ఎందుకు ప్రశ్నించలేదు’ అని ట్విట్టర్ లో ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవ్వగా దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పరువు తీసేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని నెటిజన్స్‌తో పాటు పలువురు సెలెబ్రిటీలు సైతం ఘాటుగా స్పందిస్తున్నారు.భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరేవరంటూ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సింగర్ రిహానా జన్మించిన బార్బడోస్ దేశానికి ఇండియా కరోనా వ్యాక్సిన్స్‌ను డోనెట్ చేసింది. ఆక్స్ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనెకాతో సంయుక్తంగా సీరమ్ కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ 1లక్ష డోసులను ఆ దేశానికి అందజేసింది. అంతకుముందు ఆ దేశ ప్రధాని మియా అమోర్ మోట్లే తమ దేశానికి కోవిడ్ మందులు అందజేయాలని ఫిబ్రవరి-4వ తేదీన ప్రధాని మోడీకి లేఖ రాశారు. స్పందించిన ఆయన ఆ దేశానికి కరోనా వ్యాక్సిన్ డెలివరీ చేయడంతో బార్బడోస్ దేశం, ప్రజల తరఫున పీఎం మోట్లే భారత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.