మరో వైరస్ విజృంభణ.. విమాన సర్వీలు నిలిపేసిన భారత్

by Anukaran |
మరో వైరస్ విజృంభణ.. విమాన సర్వీలు నిలిపేసిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: యూకేలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్‌ తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రపంచ దేశాలు ఆ దేశానికి విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. నేటి నుంచి 48 గంటల పాటు నెదర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, ఇజ్రాయెల్, జర్మనీ, దక్షిణాఫ్రికా విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. బ్రిటన్‌తో ఉన్న రైలు మార్గాన్ని కూడా బెల్జియం నిలిపివేసింది. అంతేకాకుండా క్రిస్మస్ వేడుకలను నిషేధిస్తూ లాక్‌డౌన్ విధించింది. తాజాగా భారత్ కూడా ఆ దేశం నుంచి రానున్న అన్ని ఫ్లైట్స్‌ను నిలపివేసింది. ఈ నిలిపివేత ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. అంతకన్నా ముందు యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ భారత విమానాశ్రయాలలో కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు.

Advertisement

Next Story