- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాయ్‌లాండ్ వెళ్లనున్న సింధు, సైనా
దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా బ్యాడ్మింటన్ కోర్టులకు దూరమైన స్టార్ ప్లేయర్లు తిరిగి రాకెట్ పట్టనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని భారత ఒలింపిక్ సంఘం 8 మందితో కూడిన జట్టును ప్రకటించింది. భారత్ తరఫున ఒలింపిక్స్‌కు ఇంకా ఎవరూ అర్హత సాధించలేదు. దీంతో జనవరి నుంచి జరుగనున్న థాయిలాండ్ ఓపెన్‌తో పాటు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు కూడా ఇదే జట్ట ప్రాతినిత్యం వహించనున్నది. భారత జట్టులో పీవీ సింధు, సైనా నెహ్వాల్, బి. సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సాత్విత్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ షెట్టి, అశ్వినిపొన్నప్ప, సిక్కి రెడ్డి చోటు సంపాదించారు. వీళ్లు జనవరి 12 నుంచి 17 వరకు జరిగే యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ ఆ తర్వాత జనవరి 19 నుంచి 24 వరకు జరిగే జరిగే టొయోటా థాయిలాండ్ ఓపెన్‌లలో పాల్గొననున్నారు.
అలాగే ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ జనవరి 27 నుంచి 31 వరకు జరుగనున్నది. ఇందులో కూడా ఈ 8 మంది షట్లర్లు పాల్గొంటారు. కరోనా మహమ్మారి అనంతరం కిదాంబి శ్రీకాంత్ ఒక్కడే ఆక్టోబర్‌లో డెన్మార్క్‌లో జరిగిన టోర్నీలో పాల్గొన్నాడు. మిగతా వాళ్లు ఏ టోర్నీ కూడా ఆడలేదు. జనవరిలో జరిగే మూడు టోర్నీలకు ఈ 8 మంది క్రీడాకారులతో పాటు వారి వ్యక్తిగత కోచ్‌లు, ట్రైనర్లు వెంట వెళ్తారు. కీలకమైన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు ముందు ఈ టోర్నీలు ఆడటం వల్ల షట్లర్లకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించే అవకాశం ఉన్నది.