- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరీస్ కైవసం చేసుకున్న కివీస్…
ఇండియా,న్యూజిలాండ్‌ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఎంతో ఉత్కంఠంగా సాగింది. సిరీస్‌ను నిర్ధేశించే ఈ రసవత్తర పోరులో న్యూజిలాండ్ 22పరుగుల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్‌ను కివీస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఇరుజట్ల మధ్య జరిగిన గత టీ20 సిరీస్‌లో ఎంతో ఉత్సాహంగా ఆడి కివీస్ వైట్‌వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌లో కుదేలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 02-00తో కివీస్ ముందంజలో ఉండి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను గప్టిల్-నికోలస్‌లు ఆరంభించారు. 93 పరుగులు వద్ద నికోలస్(41 పరుగులు) ఔటయ్యాడు. అనంతరం గప్టిల్ హాఫ్‌సెంచరీతో మెరిశాడు. నికోలస్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్లండెల్(22 పరుగులు) ఎంతో సేపు ఆడలేదు. శార్దూల్ ఠాకూర్ వేసిన 27 ఓవర్ మూడో బంతికి బ్లండెల్ ఔటయ్యాడు. దాంతో 142 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. మార్టిన్ గప్టిల్(79 పరుగులు), నికోలస్(41 పరుగులు), రాస్ టేలర్(73 పరుగులు) రాణించి స్కోర్ బోర్డును మెల్లగా పరుగులు పెట్టించారు. మొత్తంగా న్యూజిలాండ్ 50ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ మీద దెబ్బ తగలింది. ఐదు ఓవర్లకే ఓపెనర్లు పృథ్వీ షా(24 పరుగులు), మయాంక్ అగర్వాల్(3 పరుగులు), ఓపెనింగ్ వికెట్లను కోల్పోయింది. పృథ్వీ షా ధాటిగా ఆడినా 24పరుగులకే ఔటయ్యాడు. అనంతరం కోహ్లీ(15 పరుగులు), కేఎల్ రాహుల్(4 పరుగులు), కేదార్ జాదవ్(9 పరుగులు) ఇలా భారత బ్యాట్‌మెన్‌లు ఒక్కొక్కరుగా కివీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలారు. ఇక ఇండియా గెలుపు భారాన్ని శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా భుజాలపై వేసుకుని స్కోరు బోర్డును మెల్లగా పరుగులు పెట్టించారు. అనంతరం 136 పరుగుల వద్ద టీమిండియా అభిమానులకు గెలుపు మీద ఆశలు కల్పించి శ్రేయస్ అయ్యర్(52) ర్ధశతకం బాది పెవీలియన్ బాట పట్టాడు. దీంతో క్రీజులో అడుగుపెట్టిన శార్థుల్ ఠాకూర్(18) వెనుదిరిగాడు. అనంతరం జడేజాతోపాటు నవదీప్ సైనీ(45 పరుగులు) చేసి దాదాపు విజయాన్ని ఖారారు చేసే ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో క్రీజులోకి వచ్చిన చాహల్(10 పరుగులు) వద్ద ఔటయ్యాడు. ఇక భారం మొత్తం జడేజా ఒక్కడి పైనే పడింది. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా జడేజా షాట్ ఆడుతూ క్యాచ్ ఔటవడంతో భారత్ 48.3ఓవర్లకు 251పరుగులు చేసి కుప్పకూలింది. దీంతో కివీస్ విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.