వృద్ధి రేటును తగ్గించిన ఇండియా రేటింగ్స్

by Harish |
వృద్ధి రేటును తగ్గించిన ఇండియా రేటింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్ సైతం భారత వృద్ధి రేటును 2021-22కు 10.1 శాతానికి తగ్గించింది. ఇదివరకు వృద్ధి రేటును 10.4 శాతంగా ఇండియా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉండటం, టీకా పంపిణీ వేగంగా లేకపోవడమే వృద్ధి అంచనాను తగ్గించడానికి కారణంగా రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దేశంలోని కీలక ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, అయితే మే మధ్య నాటికి సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది.

ఇదే సమయంలో వృద్ధి కంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఆందోళన కలిగించే అంశమని ఇండియా రేటింగ్స్ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం తక్కువ ఆదాయం, వినియోగ డిమాండ్‌ను సూచిస్తుందని తెలిపింది. ఇది ఆర్థికవ్యవస్థలో ప్రైవేట్ పెట్టుబడుల పునరుజ్జీవనంపై ప్రభావితం చేస్తుందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ 5 శాతం, టోకు ద్రవ్యోల్బణ 5.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed