- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మంలో చాపకింద నీరులా కరోనా !
దిశ, ఖమ్మం: జిల్లాలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. వారం రోజుల కిందటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాను ఇప్పుడు కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజుకో కేసు కొత్తగా నమోదవుతుండటంతో ప్రజానీకంలో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఖమ్మం పట్టణంలోని ఖిల్లాబజార్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా బారినపడటం గమనార్హం. ఈ కుటుంబంలో ముందు వృద్ధుడికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ఆ తర్వాత ఆయన కోడలు, మనుమరాలికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే సదరు వృద్ధుడి జర్నీ హిస్టరీ, ఫోన్ కాల్స్, ఎవరెవరినీ కలిసింది అధికారులు ఆరాతీశారు. అయితే అతడిని కలిసిన వారెవరికి కరోనా నిర్ధారణ కాకపోవడం గమనార్హం. మరి వృద్ధుడికి ఎలా వ్యాధి సోకినట్లు అన్న కోణంలో విచారణ చేపట్టిన అధికారులకు సమాధానం దొరకడం లేదు.
ఇప్పటి వరకు జిల్లాలో 302మంది రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. 207మంది ఫలితాలు రాగా ఇందులో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఇంకా 97మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఆదివారం ఒక్కరోజే దాదాపు 27మంది రక్తనమూనాలను సేకరించినట్లు డీఎంహెచ్‌వో మాలతి బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇన్ పేషంట్లుగా ఆదివారం ఒక్కరోజే 81మంది జిల్లా ఆస్పత్రిలో చేరగా ఇప్పటివరకు అనుమానిత లక్షణాలతో ఉన్నవారు మొత్తం 325మంది ఉండటం గమనార్హం.
పెరిగిన జాగ్రత్త..
మోతీనగర్, ఖిల్లాబజార్, పెద్దతండాలను కంటెయిన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు నిత్యం జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో రసాయనిక ద్రావణాలను స్ప్రే చేస్తున్నారు. కంటెయిన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించిన మూడు ప్రాంతాలను అధికారులు అష్టదిగ్బంధనం చేశారు. ఎవ్వరిని బయటకు రానివ్వడం లేదు. నిత్యావసరాలను కూడా స్వయంగా అధికారులే ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. ఆరోగ్య సర్వేలు ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. అనుమానితులను గుర్తించి లక్షణాల తీవ్రత ఎక్కువగా కనిపించిన వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి కరోనా టెస్టులు చేయిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు.
Tags: Khammam, Corona Virus, Positive Cases, Containment Zone, Medical Health Department, Police, Vehicles Siege, Lockdown