పెరిగిన యాదాద్రి నరసింహుడి ఆదాయం

by Shyam |
పెరిగిన యాదాద్రి నరసింహుడి ఆదాయం
X

దిశ, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో రూ.31.36 కోట్ల ఆదాయం అధికంగా వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 2018- 2019లో రూ.99కోట్ల పైచిలుకు ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.130 కోట్లకు పైగానే వచ్చిందన్నారు. ఈ మేరకు యాదాద్రి ఆలయ అధికారులు శనివారం 2019- 2020 ఆదాయ వివరాలు విడుదల చేశారు. ప్రసాద విక్రయాలు, వ్రతాలు, దర్శనాలు, కల్యాణకట్ట, శాశ్వత పూజలతో పాటు స్వామి వారి ఎఫ్​డీల ఆదాయంతో కలుపుకొని ఈ ఏడాదికి రూ.130,93,49,664.53 ఆదాయం వచ్చిందని వివరించారు. కాగా, 2018-19లో రూ.99,57,48,282,83 మాత్రమే సమకూరింది. కరోనా నేపథ్యంలో మార్చి 19 నుంచి ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.

Tags: yadadri, income, rise, ts news

Advertisement

Next Story