- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పొంగిన దేశభక్తి.. ఆకట్టుకున్న సైకిల్ యాత్ర, భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్న సైనిక బృందం సోమవారం వనపర్తి జిల్లా శిలా ఘనపురం మండల కేంద్రానికి చేరుకోవడంతో దేశభక్తి భావాలు ఉప్పొంగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ‘స్వర్ణ విజయవర్ష విజయయాత్ర’ పేరుతో సైకిల్ యాత్ర చేస్తున్న సైనిక బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి సైకిల్ యాత్ర బృందంతో కలిసి మోటార్ సైకిల్ పై ముందుకు సాగారు. దాదాపు 600 మందికి పైగా విద్యార్థులు 450 మీటర్ల జాతీయ పతాకాన్ని దారి పొడవునా ప్రదర్శిస్తూ సైనిక బృందంతో కలిసి మండల కేంద్రానికి చేరుకున్నారు.
ప్రధాన దారుల గుండా సైకిల్ యాత్ర బృందం తో కలిసి ఊరేగింపును నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సైనికుల నిరంతర కాపలా, త్యాగాల వల్లే మనం హాయిగా ఉండగలుగుతున్నారు. సైనికులందరికీ మంత్రి వందనాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సైనికులను సన్మానించి జ్ఞాపకాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన యువత విద్యార్థులు దేశభక్తి భావాలు ఉట్టిపడేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ వేణుగోపాల్, డీఎస్పీ కిరణ్ కుమార్, డీఈవో రవీందర్, సబ్ మేనేజర్ విదేశీ, సీఐలు మల్లికార్జున్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర గౌడ్, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.