- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేద ప్రాంతాల్లో చెత్త ఆరోగ్య సదుపాయాలు -ఎన్ కె సింగ్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని వచ్చే నాలుగేళ్లకు జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని 15వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్ ఎన్ కె సింగ్ సూచించారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 0.95 శాతం మాత్రమే ఉంది. దేశంలోని అత్యంత పేద ప్రాంతాలలో చెత్త ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉండటం దురదృష్టకరమని ఎన్ కె సింగ్ అభిప్రాయపడ్డారు.
‘కాబట్టి, భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా చాలా హాని కలిగించే ఆరోగ్య మౌలిక సదుపాయాల లభ్యత లేనిచోట పరిష్కారం అత్యవసరమని’ బుధవారం జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఆసియా హెల్త్-2020 కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రాలు ఆరోగ్యంపై వ్యయాన్ని గణనీయంగా మెరుగుపరచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 2024 నాటికి దేశ జీడీపీలో 0.95 శతంగా ఉన్న ఆరోగ్య వ్యయాన్ని 2.5 శాతానికి పెంచాలని, దానికోసం తాము ప్రయత్నాలను మొదలుపెట్టామని ఆయన చెప్పారు.