నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కేంద్రాల పెంపు

by Shyam |

దిశ, నిజామాబాద్: త్వరలో జరగనున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల నిర్వహణ కోసం ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలు ఆరు నుంచి 50కి పెంచినట్టు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కోవిడ్ విస్తృత వ్యాప్తి సందర్భంగా ఓటర్లు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను డివిజన్ స్థాయిలో కాకుండా మండల స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ మార్పును స్టేక్ హోల్డర్లకు తెలియచేసేందుకు పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed