- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షం.. రైతులకు తీరని నష్టం
దిశ,నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చారు. కానీ, రోజుల తరబడి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇదే సమయంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి వడ్లన్నీ కొట్టుకుపోయాయి. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం, భువనగిరి, వలిగొండ, బీబీనగర్, మోత్కూరు, ఆలేరు, గుండాల మండలాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే నానా కొర్రీలు పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దకావడంతో అసలు ధాన్యం కొంటారా లేదా అన్న సందిగ్ధంలో రైతులు పడిపోయారు.
రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్ అనితారామచంద్రన్
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. వర్షాలతో తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిస్తే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని వివరించారు.
Tags:Nalgonda, Rains, crop purchase center, Stained grain