- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిద్దిపేటలో బోని కొట్టిన బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు
by Shyam |

X
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు బోని కొట్టారు. 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి రాధ వేణుగోపాల్, 20 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రియాజ్ ఆపిల్ గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ స్పీడ్ కి బ్రేక్ పడ్డట్లయింది. మొదటి 12 వార్డుల్లో అధికార పార్టీ గెలుపొందడం తో మిగతా వార్డులోను ఇదే ఫలితం పునరావృతం అవుతుందని ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ వారి ఆలోచనను తలకిందులు చేస్తూ బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందడం తో అధికార టీఆర్ఎస్ కాస్త నిరాశ చెందినట్టు తెలుస్తోంది. ఒక్క వార్డులో బీజేపీ విజయం సాధించడం తో ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పలు వార్డులోను విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Next Story