నా కూతురుకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం : అరవింద్ కుమార్

by Shyam |
Indies Dog Show
X

దిశ, శేరిలింగంపల్లి: వీధి కుక్కల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి డాగ్ పార్కు‌లో మార్స్ పెట్కేర్ సంస్థ ‘ఇండీస్ డాగ్ షో’ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జంతు ప్రేమికులు తమ పెంపుడు కుక్కలతో షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్యాన్సీ డ్రెస్‌ల్లో ఈ షోకు వచ్చిన డాగ్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనను తిలకించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వీధి కుక్కల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నదని, పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి వాటిని పరిరక్షించడమే కాకుండా వాటి ఆరోగ్య పరిరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని వెల్లడించారు. తన కూతురుకు కూడా డాగ్స్ అంటే ఎంతో ఇష్టమని అన్నారు.

Indies Dog Show

మార్స్ ఇండియా హెడ్ గణేష్ రమణి మాట్లాడుతూ.. వీధికుక్కల సంరక్షణ మన అందరి బాధ్యత అని, ఇటువంటి ఈవెంట్లతో పెంపుడు జంతువుల యజమానులు వీధి కుక్కల పట్ల కలిగి ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని, ప్రజల్లో వాటికి మరింత ఆదరణ కల్పించేందుకు పెట్కేర్ కృషి చేస్తోందన్నారు. జంతు ప్రేమికులు డాగ్స్ దత్తతను ప్రోత్సహించడానికి ఆన్లైన్ స్పెషాలిటీ పెట్ స్టోర్ అయిన పెట్సీ ఈ ప్రచారానికి తన మద్దతు ప్రకటించింది. మార్స్ పెట్ కేర్‌తో పాటు వెట్స్ సొసైటీ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కూడా వీధి కుక్కలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందని డాక్టర్ మురళీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెట్సీ వ్యవస్థాపకులు సినాల్ షా, వీర్ షా, డాక్టర్ మురళీధర్, శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed