రాష్ట్రపతి పాలన విధించండి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
MLA Shoaib Iqbal
X

న్యూఢిల్లీ: కరోనాతో అల్లాడుతున్న ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని అధికారిక ఆప్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడంలో నిస్సహాయుడిగా మిగిలారని ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ పేర్కొన్నారు. ‘ఢిల్లీలో పరిస్థితులతో బాధపడుతున్నాను. ఈ ఆందోళనతో నిద్ర పట్టడం లేదు. ప్రజలకు ఆక్సిజన్, వైద్య సదుపాయాలు అందడం లేదు. నా మిత్రుడూ మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్నాడు. హాస్పిటల్‌లో ఉన్నాడు, కానీ, ఆక్సిజన్ లేదా వెంటిలేర్ అందలేదు. రెమిడెసివిర్ కోసం ఆయన ప్రిస్క్రిప్షన్ నా దగ్గర ఉంది. ఆయన పిల్లలూ నా చుట్టుతిరుగుతున్నారు. కానీ, నేను నిస్సహాయంగా ఉన్నా. ప్రభుత్వమూ అంతే. ఎమ్మెల్యేగా ఉన్నందుకు మొదటిసారిగా సిగ్గుపడుతున్నాను. నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. సీనియర్ మోస్ట్‌ను. అయినా, నాకు ఎవ్వరూ స్పందించడం లేదు. కనీసం నోడల్ అధికారినీ సంప్రదించలేకున్నా. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ హైకోర్టును కోరుతున్నాను. లేదంటే రోడ్లపై శవాలకుప్పలు కనిపించవచ్చు’ అని వాపోయారు.

Advertisement

Next Story