- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రపతి పాలన విధించమని… మోడీకి సీడిని, పేపర్ క్లిప్పింగ్‌లు పంపిన బాబు
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారత ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు బుధవారం సాయంత్రం లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై లేఖలో ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అదుపులో లేవని..ప్రతిపక్ష పార్టీలపై అధికార పార్టీ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఇంటి దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రాన్ని నేరాలకు అడ్డగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్, హెరాయిన్‌లతో వైసీపీ నేతలు బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లోని ముుంద్రా పోర్టులో లభించిన హెరాయిన్ మూలాలు ఆంధ్రాలోనే ఉన్నాయని తేలిందని లేఖలో స్పష్టం చేశారు. అలాగే విశాఖలో వైసీపీ నేతల పర్యవేక్షణలోనే గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు. జాతీయ మీడియా సంస్థలు సైతం రాష్ట్రంలో హెరాయిన్, డ్రగ్స్, గంజాయి సరఫరా అవుతుందని.. అందుకు సంబంధించిన ప్రసార దృశ్యాలతో కూడిన సీడిని, పేపర్ క్లిప్పింగ్‌లను చంద్రబాబు లేఖకు జతపరిచి పంపించారు.