- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పూణే ఎర్రవాడ జైలు విశేషాలివే….
దిశ,వెబ్‌డెస్క్: టూరిస్టులకు మహారాష్ట్ర జైళ్ల శాఖ ఓ స్వీట్ న్యూస్ చెప్పింది. చారిత్రక నేపథ్యం కలిగిన పూణే ఎర్రవాడ జైలును సందర్శించేందుకు టూరిస్టులను అనుమతించనున్నట్టు తెలిపింది. చారిత్రక గుర్తులను ప్రజలు కండ్లార చూసేందుకు, చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడంలో ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో పూణే ఎర్రవాడ జైలు గురించి…అక్కడ ఉన్న చారిత్రక విశేషాలపై స్టోరీ…
పూణే ఎర్రవాడ జైలు.. మహారాష్ట్రలో కెల్లా అతి పెద్ద జైలు ఇది…దేశంలో అత్యధిక సెక్యూరిటీ కలిగిన జైళ్లలో ఒకటి. 1866లో ఈ కారాగారాన్ని బ్రిటీష్ పాలకులు నిర్మించారు. సుమారు 500 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ కారాగారం నిర్మితమైంది. 150 ఏండ్లకు పైబడిన చారిత్రక నేపథ్యం ఈ జైలుకు ఉంది.
చారిత్రక నేపథ్యం:
స్వాతంత్ర పోరాట సమయంలో ప్రముఖంగా వినిపించిన పేరు…పూణే ఎర్రవాడ జైలు. స్వాతంత్ర పోరాట సమయంలో భారత జాతి పిత మహాత్మగాంధీ ఈ జైలులో మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు. మరో నాయకుడు లోక్ మాన్య బాల గంగాధర్ తిలక్ కూడా 1933లో ఇక్కడ జైలు జీవితం గడిపారు. 1930లో పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్(1936), సరోజిని నాయుడు(1940) ఇంకా ఎందరో స్వాతంత్ర పోరాటంలో ఈ జైలుకు వెళ్లిన వారే. గాంధీజీ-అంబేద్కర్‌ల మధ్య చారిత్రాత్మక పూణే ఒప్పందానికి కూడా ఈ జైలు సజీవ సాక్ష్యంగా నిలిచింది.
జైలులో చారిత్రక ప్రదేశాలు:
జైలులో పలు చారిత్రత్మక యార్డులు ఉన్నాయి. వాటిలో గాంధీజీ శిక్ష అనుభవించిన బ్యారక్ గాంధీ యార్డు, తిలక్ శిక్ష అనుభవించిన తిలక్ యార్డులు ప్రముఖ మైనవి. ఇంకా ఈ జైలులో చూడదగిన మరో చారిత్రాత్మక ప్రదేశం ఫాసీ యార్డు. పూణేలో ప్లేగు వ్యాధిపై బ్రిటిష్ కమిషనర్ రాండ్‌ను హత్య చేసినందుకు చాపేకర్ సోదరులకు మరణ శిక్ష అమలు చేసింది ఇక్కడే. ఈ ఫాసీ యార్డులోనే కరుడు కట్టిన తీవ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012లో ఉరి తీశారు. ఇలా ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు ఈ జైలు వేదికగా నిలిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం…పూణె ఎర్రవాడ జైలును ఓ సారి చూసొద్దామా….