క్రిప్టోకరెన్సీల నిషేధం కంటే నియంత్రణ ముఖ్యం: ఐఎంఎఫ్ గీతా గోపీనాథ్!

by Harish |
Gita Gopinath
X

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టోకరెన్సీలను నిషేధించడం కంటే నియంత్రించడం మంచిదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. క్రిప్టోకరెన్సీలకు డిమాండ్ అధికంగా ఉన్న ఇలాంటి సమయంలో దీనిపై అంతర్జాతీయ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలే కాకుండా వర్ధమాన దేశాలు ఇలాంటి కరెన్సీలను నిషేధించడం వల్ల ప్రయోజనాలు ఉండవని, వీటికి సంబంధించిన లావాదేవీలన్నీ విదేశాల్లో జరుగుతుంటాయని గుర్తించాలని తెలిపారు. క్రిప్టో ఆస్తులను, కరెన్సీలను నిషేధించినా ట్రేడింగ్ కొనసాగుతాయని, కాబట్టి నియంత్రించడమే మెరుగైన మార్గమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వీటికి ఆదరణ పెరుగుతున్న కారణంగా వీలైనంత వేగంగా గ్లోబల్ క్రిప్టోకరెన్సీ విధానం తీసుకురావాలని వివరించారు.

Advertisement

Next Story